ఆ హీరోయిన్ అతనిని ప్రేమించడం తనకు నచ్చలేదని ఆమెను ఇంటికి లాక్కుపోయిన తండ్రి..?

Thursday, December 29th, 2016, 06:09:06 PM IST

shradha
బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతుంది శ్రద్ధాకపూర్. నటుడు పర్హాన్ అక్తర్, శ్రద్ధాకపూర్ ప్రేమించుకుంటున్నారని చాలాకాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రేమ జంట గురించి మరొక వార్త బయటకొచ్చింది. ఇప్పుడు శ్రద్ద ఏకంగా తన మకాం మొత్తం ఫర్హాన్ అక్తర్ ఇంటికి మార్చేసిందని సమాచారం. అయితే ఈ విషయం తెలుసున్న శ్రద్ధాకపూర్ తండ్రి శక్తీ కపూర్ ఫర్హాన్ ఇంటికి వెళ్లి కూతురిని అతని ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చి ఇంటికి తీసుకుపోయాడని సమాచారం.

ఫర్హాన్ కు ఇదివరకే వివాహమై అతనికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అందుకే శ్రద్ధాకపూర్ తల్లితండ్రులైన శక్తీ కపూర్, శివంగి కపూర్ లకు వీరి ప్రేమ వ్యవహారం నచ్చట్లేదంటున్నారు. ఫర్హాన్ అక్తర్ తన భార్య అధునా అక్తర్ కు విడాకులిచ్చి శ్రద్ధాకపూర్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కానీ శక్తికపూర్ కి వీరి ప్రేమ నచ్చట్లేదన్న వార్తలను కొంతమంది ఖండిస్తున్నారు. బుధవారం శ్రద్ధాకపూర్.. అర్జున్ రాంపాల్ దంపతులతో కలిసి ఫర్హాన్ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది. శక్తీ కపూర్ కి వీళ్ళ ప్రేమ ఇష్టం లేకపోతె మళ్ళీ తనను బయటకు ఎలా పంపుతారని అనుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments