వచ్చేనెలలో పెళ్లిపీటలెక్కబోతున్న శ్రియ !

Tuesday, February 27th, 2018, 06:01:12 PM IST

2001 వ సంవత్సరం లో ఇష్టం చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుబెట్టిన శ్రీయ తరువాత సంతోషం, నువ్వే నువ్వే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయ కులందరితోను ఆమె నటించారు. అలానే మహేష్, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్ లతో కూడా నటించారు. కాగా ఆమె త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఆమె రష్యాకు చెందిన ఆండ్రీ కుశ్చేవ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలో ఇతడో వ్యాపారవేత్త, క్రీడాకారుడు కూడా. అయితే అప్పట్లో ఆండ్రీతో కలిసి షాపింగ్ చేసిన ఆమె మీడియా కంట పడ్డారు.

దానిపై మీడియా ప్రశ్నించగా తన స్నేహితురాలి వివాహం కోసమే ఇలా షాపింగ్ చేస్తున్నామని ఆమె అప్పుడన్నారు.అయితే చివరికి ఇప్పుడు శ్రియ పెళ్లి వార్త అఫీషియల్ అయింది. పెళ్లిని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మార్చి 17, 18, 19తేదీల్లో మూడురోజుల పాటు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో మార్చి 17న జరిగే సంగీత్ తో పెళ్లి వేడుకలు ప్రారంభం అవుతాయి. ఆ సంగీత్ ను హోలీ థీమ్ తో సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇక 18వ తేదీన వధూవరులిద్దరూ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోబోతున్నారు.19వ తేదీన అతిథులు, స్నేహితులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేస్తారు. అయితే ఈ మూడు రోజుల వివాహం అనంతరం మాస్కోలో మరో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట..