అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారు?.. శ్రియ కౌంటర్

Tuesday, January 30th, 2018, 11:39:11 AM IST

సౌత్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ గా కొనసాగుతోన్న బ్యూటీ ఎవరైనా ఉన్నారా అంటే అందరూ శ్రియ అనే చెబుతారు. అప్పుడెప్పుడో 2001లో తెలుగు ఇండస్ట్రీకి ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత స్టార్ హీరోలతో అవకాశాలను అందుకొని వరుసగా సినిమాలను చేసింది. కుర్ర హీరోలతో కూడా శ్రియ నటించింది. అయితే ప్రస్తుతం శ్రియను మీడియా పదే పదే ఒక ప్రశ్నను అడిగి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు అంతోంది.

అంతే కాకుండా మీడియాలో ఆ ధోరణి మారాలని సలహాలను ఇస్తోంది. ఇప్పటివరకు మీకు ఇంకా అవకాశాలు వస్తున్నాయి అంటే అందుకు ఎదో ఒక కారణం ఉంటుంది. ఏంటది? అనే ప్రశ్న ప్రతి మీడియా సమావేశంలో శ్రియ ఎదుర్కుంటోందట. రీసెంట్ గా గాయత్రి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలాంటి ప్రశ్నలే మళ్లీ ఎదురయ్యే సరికి శ్రియ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఆ తరహా ఆలోచనతో ఉండకూడదు. హాలీవుడ్ లో 60 ఏళ్లు వచ్చినా కూడా హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. అలాంటిది తాను చేస్తే ఇలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతున్నారని చెప్పింది. దయచేసి మీడియా అలాంటి ప్రశ్నలు అడగవద్దని. ఆ ధోరణి మారాలని వివరించింది.