వ్యక్తిగత విషయాలను అమ్ముకోనూ : శ్రియ ?

Tuesday, October 23rd, 2018, 03:55:57 PM IST

జనరల్ గా సినిమా వాళ్ళ జీవితాలు అంటే పబ్లిక్ ప్రాపర్టీ లాంటివి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి దాపరికాలు ఉండవు .. ఒకవేళ దాపరికం మైంటైన్ చేయాలన్న ఎదో ఓ సందర్బంగా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో గ్లామర్ భామ శ్రియ మాత్రం సీరియస్ గా ఉంది .. ప్రొఫెషన్ లైఫ్ గురించి ఏదైనా మాట్లాడండి .. కానీ పర్సన్ లైఫ్ గురించి మీకు అవసరం లేదని కాస్త గట్టిగానే చెప్పింది. ఈ మద్యే శ్రియ రష్యన్ బిజినెస్ మెన్ ని వివాహం చేసుకున్న తరువాత ఆమె పెళ్ళికి సంబందించిన వ్యవహారాలు కానీ అతగాడి గురించి వివరాలు కానీ బయటపెట్టలేదు. తాజాగా శ్రియ వీరభోగ వసంత రాయలు సినిమాలో నటిస్తున్న సందర్బంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. మీరు పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి అని అడిగిన యాంకర్ కు అదిరిపోయే సమాధానం ఇచ్చింది శ్రియ. మా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు. మా పర్సనల్ జీవితాలను అమ్మోకోవడానికి సిద్ధంగా లేము. ప్రొఫెషన్ గురించి అడగండి చెబుతా ? అంటూ గట్టిగానే చెప్పడంతో సదరు యాంకర్ అవాక్కయింది ? శ్రియ ఎందుకు పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం లేదన్న విషయం పై పలు రకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments