పెళ్లి గురించి అభిమాని వేసిన ప్రశ్నకు షాకైన శ్రియ!

Tuesday, June 5th, 2018, 12:30:40 PM IST

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రియా సరన్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలు చేస్తున్నట్టే చేసి సడన్ షాక్ ఇచ్చిన శ్రియ అభిమానులను షాక్ కి గురి చేసిందని చెప్పాలి. రష్యన్ హస్బెండ్ ఆండ్రీ కోస్చేవ్ తో ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మొదట శ్రియ పెళ్లి జరిగింది అనగానే చాలా వరకు ఆ పెళ్లి కొడుకు ఎవరనే టాక్ ఎక్కువగా వచ్చింది. ఏ యాక్టరో అయ్యి ఉంటాడని అనుకున్నారు. అలాగే ఇండియాకు చెందిన బిజినెస్ మెన్ అనే టాక్ వచ్చింది.

కానీ ఆ లక్కీ బాయ్ ఒక రష్యన్ అని ఎవరు ఊహించలేకపోయారు. అయితే రీసెంట్ గా శ్రియ పెళ్లి ప్రస్తావన గురించి ఒక అభిమాని విసిరిన ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయిందట. ఇటీవల అమెరికాలో తెలుగు వాళ్లకు సంబందించిన ఆట – టాటా ఉత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలకు శ్రియ స్పెషల్ గెస్ట్ గా వెళ్లింది. అయితే అక్కడ శ్రియను చూసి ఒక అభిమాని పెళ్లి చేసుకోవడానికి రష్యన్ వ్యక్తి ఎలా దొరికాడు మేడమ్.. మారేవరు నచ్చలేదా అని ప్రశ్నించాడట. అది విన్న శ్రియ మొదట ఆశ్చర్యపోయి సింపుల్ ఆన్సర్ ఇచ్చేసింది. ఏం చేస్తాం.. ఒకసారి ప్రేమిస్తే.. మారే విషయాల గురించి సందేహాలు రావు కదా అన్నట్లు సమాధానం ఇచ్చేసిందట. దీంతో అక్కడ ఉన్న ఎన్నారైలు ఒక్కసారిగా నవ్వేశారట. ఏది ఏమైనా ప్రేమ గురించి శ్రియ బలే చెప్పిందని అందరు డైలాగ్స్ వేసేశారు.