శ్రియ 100లోనే కాదు.. 150లో కూడా?

Friday, September 23rd, 2016, 10:28:30 AM IST

shreya
బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న వందో చిత్రం `గౌత‌మీ పుత్ర శాత‌కర్ణి`లో అవ‌కాశం అందుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది శ్రియ‌.ఎంతో మంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చినా చిట్ట చివ‌రికి ఆ అవ‌కాశం శ్రియ‌ని వ‌రించింది. అందుకే అదృష్టం అంటే శ్రియ‌దే అని మాట్లాడుకొన్నారంతా. కెరీర్ ఇక చివ‌రి ద‌శ‌కు వ‌చ్చే సింద‌నుకొంటున్న ప‌రిస్థితుల్లో ఆమె కీల‌క‌మైన చిత్రాల్లో అవ‌కాశాల్ని అందుకోవ‌డ‌మంటే విశేష‌మే మ‌రి. అయితే ఇప్పుడు మ‌రో షాక్ ఇచ్చింది శ్రియ‌. చిరంజీవి
క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 150వ సినిమాలోనూ ఆమె ఓ కీల‌క పాత్ర కోసం ఎంపికైంద‌ట‌. అంటే ఠాగూర్ జోడీని మ‌రోసారి తెర‌పై చూడొచ్చ‌న్న‌మాట‌. చిరు 150వ చిత్రం `ఖైదీ నెంబ‌ర్ 150`లో ఓ క‌థానాయిక చేయాల్సిన కీల‌క‌మైన పాత్ర ఉంద‌ట‌. ఆ పాత్ర కోసం ఎవ‌రిని ఎంపిక చేయాలా అని ఆలోచించిన వి.వి.వినాయ‌క్‌కి శ్రియ గుర్తొచ్చింద‌ట. వినాయ‌క్ ఇదివ‌ర‌కు చిరుతో తెర‌కెక్కించిన `ఠాగూర్‌` సినిమాలోనూ శ్రియ‌నే క‌థానాయిక‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఆమైతే ఓకే అని చిరు కూడా చెప్పాడ‌ట‌. ఇక శ్రియ కాల్షీట్లు కేటాయించ‌డ‌మే లేట‌ని చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి.