శ్రియ కాపురం పెట్టేది .. రష్యాలోనే ?

Wednesday, April 4th, 2018, 10:11:48 AM IST

సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ శ్రియ లేటెస్ట్ గా రష్యన్ యువకుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా అతగాడితో ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు రహస్యంగానే వివాహం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు వెంకటేష్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది కానీ పెళ్లి జరగడంతో ఆ సినిమా నుండి తప్పుకుందట. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజగా శ్రియ రష్యాలోని కాపురం పెట్టేందుకు రెడీ అయిందట. త్వరలోనే ఆమె రష్యాకు పయనం అవుతుంది. దాంతో పాటు ఆమె కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. వాటికి కూడా కొన్నాళ్ళు బ్రేక్ ఇవ్వనుందట.

  •  
  •  
  •  
  •  

Comments