పాలిటిక్స్ లో డాడీ వెంట ఉండను .. ఇష్టం లేదు: శ్రుతి హాసన్

Tuesday, February 20th, 2018, 04:34:52 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ మరికొన్ని రోజుల్లో రాజకీయాల్లోకి రాబోతున్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయన రాక మాత్రం చాలా ఊరిస్తూనే ఉంది. గత కొన్ని నెలలుగా పార్టీ పేరును ప్రకటించేందుకు ఒక తేదీని అనుకున్నప్పటికీ ఎందుకో గాని మళ్లీ క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతోంది. అయితే ఈ సారి ఎలాగైనా తప్పకుండా పార్టీ ని స్థాపించి తన రాజకీయాలను మొదలు పెట్టాలని కమల్ ఆలోచిస్తున్నారు.ఈ నెల 21న రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధి సాక్షిగా తన రాజకీయ పార్టీ జెండాను స్థాపించనున్నట్లు కమల్‌ హాసన్‌ తెలియజేశారు.

అయితే కమల్ తో పాటు ఆయన కూతురు శృతి హాసన్ కూడా కమల్ తో సాగనుందని ఎన్నికలో బరిలో మద్దతు ఇవ్వనుందని చాలా వార్తలు వచ్చాయి. అయితే విషయంపై రీసెంట్ గా శృతి క్లారిటీ ఇచ్చింది. నేను రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. నా తండ్రితో ఆ విధంగా సాగాలని అనుకోవడం లేదు. అలాగే నాకు రాజకీయాల గురించి ఏ మాత్రం తెలియదు. కాని ఒక భారతీయ యువతిగా నా తండ్రికి మద్దుతు ఇస్తాను. కానీ ఆయన వెంట నడిచే ఆలోచన నాకు లేదు. ఇక 21వ తేదీన జరగబోయే పార్టీ ఆవిర్భావ వేడుకకు కూడా వెళ్లడం లేదని, ఆ రోజు నాకు షూటింగ్ ఉందని శృతి హాసన్ మీడియాకు ముందే క్లారిటీ ఇచ్చేసింది.