హీరోయిన్‌ని బూతు మెసేజ్‌ల‌తో వేదించిన డాక్ట‌ర్‌?

Thursday, November 10th, 2016, 05:05:00 PM IST

SHruthi-hassan
అందాల క‌థానాయిక శ్రుతిహాస‌న్ ముంబైలో నివాసం ఉంటున్న‌ప్పుడు ఓ దుండగుడు ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో లోనికి జొర‌బ‌డాల‌ని చూసిన ఘ‌ట‌న గుర్తుండే ఉంటుంది. 2013లో ఇది జ‌రిగింది. అయితే అందుకు కొన‌సాగింపు సీక్వెన్స్ ఇది. శ్రుతిహాస‌న్‌ని ఓ డాక్ట‌రు బూతు మెసేజ్‌ల‌తో వేదించిన ఘ‌ట‌న బైట‌ప‌డింది. ఈ బుధ‌వారం ఆ మేర‌కు శ్రుతి చెన్న‌య్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. గురుప్ర‌సాద్ కె.జి అనే క‌ర్నాట‌కకు చెందిన ఓ డాక్ట‌రు త‌న‌ని బూతు మెసేజ్‌ల‌తో వేదించాడ‌ని, ట్విట్ట‌ర్‌లో ప‌రిచ‌యం కాస్తా ఇంత‌కు దారి తీసింద‌ని శ్రుతి ఫిర్యాదులో పేర్కొంది. అత‌డు ప‌రుష‌ప‌ద‌జాలంతో త‌న‌ని నిందించాడు. ఒకానొక సంద‌ర్భంలో చంపేస్తాన‌ని బెదిరించాడు. త‌న ఫ్యామిలీ ర‌హ‌స్యాల‌తోపాటు కాన్ఫిడెన్షియ‌ల్ విష‌యాల్లో త‌ల‌దూర్చాడు. ఇదంతా రెండు పేజీల ఫిర్యాదులో శ్రుతి పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7న అత‌డు ట్విట్ట‌ర్‌లో అబ్యూజ్ చేసిన తీరును మొబైల్ స్క్రీన్‌షాట్స్‌లో పోలీసుల‌కు చూపించింది శ్రుతి. ప్ర‌స్తుతం పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.