ప్రేమ షికార్లతో శృతి జోరు.. ఇక సినిమాలు డౌటే !!

Monday, February 19th, 2018, 01:17:10 PM IST

సౌత్ క్రేజీ భామ శృతి హాసన్ ఘాటు ప్రేమాయణంలో ఉంది. ప్రేమలో పడ్డవాళ్ళు ఎవరిమాటా వినరు .. వారి లోకం వారిదే అన్న తరహాలో ఈ అమ్మడు ప్రవర్తిస్తుంది. ఇప్పటికే బ్రిటన్ యువకుడు మైఖేల్ కోర్సల్ తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న ఈ అమ్మడు అతగాడితో జోరుగా షికార్లు ఇంకా చేస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రేమలో ఉంది కాబట్టి ఇటు సినిమా అవకాశాలు వచ్చినా నో చెబుతుంది. ప్రస్తుతం ఓ ప్రయివేట్ మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్న అంటున్న ఈ భామ ఆల్బమ్ సంగతి పక్కన పెట్టి తన బాయ్ ఫ్రెండ్ తో తెగ చక్కర్లు కొడుతుందట. ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా తన ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తుందని టాక్ !! వీరి వ్యవహారం పై కోలీవుడ్ లో మాత్రం రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. అయితే ఈ విషయాలపై ఈ అమ్మడు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ఇక శృతి హస్సన్ వ్య్వవహారం పై అటు బి టౌన్ లో జోరు కథనాలు వస్తున్నాయి మరి !! కెరీర్ సవ్యంగా సాగుతున్న సమయంలో ఇలా ప్రేమా దోమా అంటు కెరీర్ ని ఎందుకు పాడు చేసుకుంటున్నావని సలహాలు ఇస్తున్నారు.