శృతి తప్పుతోంది .. సైడ్ అయినట్టేనా?

Saturday, October 6th, 2018, 01:32:09 PM IST

గ్లామర్ భామ శృతి హాసన్ ఈ మధ్య ఏ సినిమా చేయడం లేదు. ఎన్నో అవకాశాలు వస్తున్నా కూడా అన్నింటికీ నో చెబుతుంది. ఇప్పటికే సౌత్ లో గ్లామర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శృతి హాసన్ ఫోకస్ ఇప్పుడు సినిమాలు కాదట .. పాప్ స్టార్ గా ఎదగాలని ఆశపడుతోంది . అదేంటి సౌత్ లో గ్లామర్ హెమోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఒప్పుకున్నా టాప్ హీరోయిన్ గా ఇమేజ్ తెచుకోగలదు, కానీ ఈ అమ్మడు ఎందుకో మ్యూజిక్ రంగాన్ని ఎంచుకోవాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే పలు సాంగ్స్ పాడి కంపోజ్ చేసిన ఈ అమ్మడు ఇకపై రాక్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయింది . అంతే కాదు కమల్ హాసన్ నటించిన ఈనాడు సినిమాకు మ్యూజిక్ కూడా అందించింది. ఇప్పుడు మ్యూజిక్ టీమ్ ని పెట్టుకుని ప్రత్యేక ఆల్బమ్ చేయాలనే ఆలోచనలో ఉంది. పైగా ఈ మద్యే లండన్ లో ఓ షో కూడా ఇచ్చిందట. శృతి హాసన్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ సరసన కాటమారాయుడు సినిమా తరువాత ఏ తెలుగు సినిమాలో కనిపించలేదు .. సో శృతి కొత్త ఆలోచనతో ఇకపై హీరోయిన్ గా కనిపించదేమో మరి !!