పెళ్లి గురించి శృతి హాసన్ ఏమందో తెలుసా ?

Saturday, April 28th, 2018, 09:47:46 AM IST

జాతీయ నటుడు కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయం అయినా అందాల భామ శృతి హాసన్ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది. సౌత్ లో టాప్ హీరోయిన్ రేంజ్ లోకి దూసుకెళ్లిన ఈ అమ్మడి బాలీవుడ్ కలలు మాత్రం నెరవేరలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలగాలని కోరికతో ఎన్నో సినిమాల్లో నటించినా పెద్దగా లాభం లేకపోయింది. బాలీవుడ్ సినిమాలకోసం సూచి లో క్రేజీ ఆఫర్స్ ని కాదన్నది. ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. తాజగా మైకేల్ కొర్సాల్ అనే బ్రిటన్ కు చెందిన యువకుడితో జోరు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీరి వ్యవహారం పై పలుమార్లు ఫ్యామిలి చర్చలు కూడా జరిగాయి. తాజగా శృతి హాసన్ పేస్ బుక్ లైవ్ లోకి వచ్చింది. శృతి పేస్ బుక్ లైఫ్ లోకి రాగానే .. ఆమెను అభిమానులు బాగానే ఫాలో అయ్యారు. ఈ సందర్బంగా శృతి హాసన్ పై ప్రశ్నల వర్షం కురిసింది. ముక్యంగా పెళ్లి ఎప్పుడని ఓ అభిమాని అడిగితె .. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటూ చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ .. ప్రస్తుతం సరైన స్క్రిప్ట్స్ రావడం లేదని అందుకే సినిమాల్లో నటించడం లేదని చెప్పింది. మొత్తానికి శృతి పెళ్లి గురించి నిజమే చెప్పిందా ? లేక అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments