మాస్ రాజా సరసన శృతి హాసన్ ?

Wednesday, May 23rd, 2018, 10:21:21 AM IST

ప్రస్తుతం నేల టికెట్ సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయినా రవితేజ, ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే శ్రీను వైట్లతో అమర్ అక్బర్ ఆంటోని, తేరి రీమేక్ లు చేస్తున్న అయన ఈ నెల చివరి నుండి అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లనున్నారు. దాదాపు రెండు నెలలపాటు అక్కడే ఉంటాడట. ఈ సినిమాలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని దింపడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే గోవా భామ ఇలియానాతో చర్చలు జరుగుతున్నాయి. ఇలియానా కూడా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అందులో మరో హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేశారు. తాజాగా జరిగిన చర్చలతో శృతి హాసన్ కూడా ఓకే చెప్పిందట . ఇక మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. శృతి హాసన్ ఇది వరకే బలుపు లో నటించింది. వీరిద్దరి పెయిర్ కు మంచి క్రేజ్ రావడంతో మరోసారి ఈ జోడీని రిపీట్ చేయనున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ కేవలం ఒకే ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తుండటం మళ్ళీ తెలుగులోకి చాల గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments