రవితేజతో మరోసారి జోడికట్టనున్న క్రేజీ హీరోయిన్ ?

Wednesday, May 2nd, 2018, 12:25:42 PM IST

మాస్ రాజా రవితేజ కాస్త గ్యాప్ తరువాత స్పీడ్ పెంచేసాడు. ఇప్పటికే అయన నటిస్తున్న నేల టికెట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత సంతోష్ శ్రీనివాస్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తీ కావొచ్చినా ఈ సినిమా ఈ నెల చివర్లో సెట్స్ పైకి రానుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్నట్టు సమాచారం. అయితే ఇందులో హీరోయిన్ గా సౌత్ క్రేజీ భామ శృతి హాసన్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పవన్ తో చేసిన కాటమరాయుడు తరువాత మారె తెలుగు సినిమాలో నటించలేదు. అటు తమిళంలో కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ భామ. కొంత గ్యాప్ తరువాత మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టిన శృతి తో చర్చలు జరుపుతున్నారట దర్శక నిర్మాతలు. ఇప్పటికే రవితేజ సరసన బలుపు చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్న శృతి హాసన్ మరోసారి జోడి కట్టనుందన్నమాట !!

  •  
  •  
  •  
  •  

Comments