షాక్ .. శృతి హాసన్ ప్రేమాయణం లీకయిందిగా ?

Friday, February 17th, 2017, 09:09:50 AM IST


అందాల భామ శృతి హాసన్ అప్పుడప్పుడు సడన్ షాక్ లు ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవలే సింగం 3 లో నటించింది. ఇక తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈమే ప్రేమలో పడ్డట్టు ఆ మధ్య రకరకాల పుకార్లు వచ్చాయి .. ఈ విషయంలో శృతి కూడా ఆబ్బె… అలాంటిది ఎం లేదని ప్లేట్ ఫిరాయించింది కానీ లేటెస్ట్ గా లవర్ తో అడ్డంగా దొరికిపోయింది!! శృతి గత కొన్ని రోజులుగా ఓ ఇటాలియన్ అబ్బాయితో డేటింగ్ చేస్తుందని, ఇద్దరు కలిసి తెగ షికార్లు కొడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి? అతగాడి పేరు మైకేల్ కొర్సాల్ అని, అతనితో కలిసి ముంబై వచ్చినప్పుడు ఇలా కెమెరా కంట పడింది ? మరి ఈ విషయం పై ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి !!