అబ్బో … ఆ బాబుకు శృతి హాసన్ కావాలంట?

Sunday, February 19th, 2017, 12:15:55 PM IST


ఆ బాబును హీరోగా నిలబెట్టేందుకు ఆ నిర్మాత కం తండ్రి ఎక్కడ వెనకాడడం లేదు? తన డ్రీం ని తన కొడుకులో చూసుకుని మురిసిపోతున్న ఆ నిర్మాత తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికే ఏకంగా 30 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసాడు ? ఆ సినిమాతో ఆ హీరోకూడా మంచి సక్సెస్ అందుకుని హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు ? ఈ కథ అంట వింటుంటే ఎవరో గుర్తొచ్చింది కదా ? అవును అతనే బెల్లంకొండ శ్రీనివాస్. అయన తండ్రి బెల్లంకొండ సురేష్ తన కొడుకుతో ”అల్లుడు శీను” సినిమా తీసి హీరోగా నిలబెట్టాడు. ఇక రెండో సినిమాతో ప్లాప్ అందుకున్న శ్రీనివాస్ కు మరో హిట్ ఇచ్చేనందుకు బెల్లంకొండ సురేష్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పూర్తీ కావొచ్చింది. ఇక ఈ సినిమా తరువాత అయన నాలుగో సినిమా కూడా బెల్లంకొండ నిర్మిస్తున్నాడు. శ్రీవాస్ దర్శత్వంలో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ కావాలని ప్లాన్ చేస్తున్నారట !! ఇప్పటికే సమంత, రకుల్ , తమన్నా లతో ఆడిపాడిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో శృతి హాసన్ అయితే బాగుంటుందని చెప్పడంతో ఇప్పుడు ఆమెతో చర్చలు జరుపుతున్నాడట నిర్మాత !! ఆమె రెమ్యునరేషన్ ఎంత అడిగిన ఇవ్వడానికి రెడీ అయ్యాడని తెలిసింది, మరి ఈ సినిమాకు శృతి ఓకే అంటుందో లేదో చూడాలి !!