శృతి హాసన్ సీక్రెట్ ప్రేమాయణం సాగిస్తుందా?

Tuesday, September 27th, 2016, 12:59:51 PM IST

SHruthi-hassan
అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు? సౌత్ క్రేజీ హాట్ భామ శృతి హాసన్ ఈ మధ్య బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుంది. ఇప్పటికే తమిళంలో కమల్ ”శబాష్ నాయుడు”, తెలుగులో పవన్ కళ్యాణ్ ”కాటమరాయుడు” సినిమాలు మాత్రమే చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలగాలనే గట్టి ప్రయత్నంలో ఉన్న ఈ అమ్మడికి కాలం మాత్రం కలిసి రావడంలేదు? ఇక గ్లామర్ కు పెద్ద పీట వేసి అందాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆరబోయడంలో ఆమెకు సాటి ఎవరు రారు? ఇక ఈ మధ్య ఈ భామ ఓ బాలీవుడ్ యువ హీరోతో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి వ్యవహారం పై జోరుగా ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి ? అయితే ఆ హీరో ఎవరో తెలుసా.. బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ ? రణబీర్ ఇప్పటికే అటు దీపికా, ఇటు కత్రినాలతో ఘాటు ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే, ఇక దీపికా మనోడికి కాదనుకుని రణవీర్ సింగ్ దగ్గరికి వెళ్ళింది, ఇక కత్రినా కూడా ఈ మద్యే రణబీర్ కు బాయ్ చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో మనోడు శృతి ని పట్టాడట !! ఇప్పటికే వీరిద్దరూ నైట్ క్లబ్ లని, పార్టీ లని జోరుగా షికార్లు చేస్తున్నట్టు సమాచారం? మరి వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు దారి తీస్తుందో .. లేదా మధ్యలోనే కట్ అవుతుందో చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments