రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిన శృతి హాసన్

Sunday, February 26th, 2017, 11:45:35 AM IST


బ్రిటీష్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సాల్ తో ప్రేమ వ్యవహారం నడుపుతూనే మాయిద్దరి మధ్యనా ఏమీ లేదు అంటోంది శృతి హాసన్. వారిద్దరి ప్రేమనీ ఎంతగా ఆమె దాచాలని చూసినా మీడియా ఇంటరాక్షన్ ఎక్కువగా ఉన్న ఈ కాలం లో అది బయట పడిపోతూ ఉండడం విశేషం. ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇద్దరూ ముంబై లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు కూడా. ‘ఇండియాలో ఓ మంచి అమ్మాయితో చక్కటి సమయాన్ని గడిపాను. అందమైన స్నేహితుల బృందం ఇక్కడుంది. ఇండియా నాకు రెండో ఇల్లు’ అని వ్యాఖ్యానిస్తూ, మైఖేల్ ఈ ఫోటోను పోస్టు చేశాడు. కాగా, బ్రిటిష్‌ ఆల్టర్నేటివ్‌ రాక్‌ బ్యాండ్‌ లో ప్రదర్శన నిమిత్తం వెళ్లిన శ్రుతికి ఓ స్నేహితుడి ద్వారా మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్‌ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.