శృతి హాసన్ కు ఛాన్సులు కరువైంది అందుకేనా..?

Monday, October 30th, 2017, 11:47:13 PM IST

శృతి హాసన్ ఈ మధ్యన మీడియాకు దూరంగా ఉంటోంది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతి హాసన్ ప్రభావం ఇప్పుడు తగ్గింది. భారీ చిత్రమైన సంఘమిత్ర నుంచి తప్పుకున్న తరువాత శృతి హాసన్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఏంటనే చర్చ సినీవర్గాల్లో జరుగుతోంది.

ఇటీవల శృతి హాసన్ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చింది. ఈ సందర్భంగా శృతిని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. షూటింగులు లేకపోవడం వలనో, ఫిజిక్ పై సరైన శ్రద్ద చూపకపోవడం వలనో కానీ ఈ ముద్దు గుమ్మ కాస్త బొద్దుగుమ్మగా మారిపోయింది. దీనికి సంబందించిన శృతి ఫోటోలు వైరల్ గా మారాయి. శృతికి అవకాశాలు తగ్గడానికి కారణం కూడా ఆమె లావుగా మారడమే అని చర్చించుకుంటున్నారు. అదేం లేదని షూటింగ్ లకు గ్యాప్ రావడంతో కాస్త బొద్దుగా కనిపిస్తోందని శృతి అభిమానులు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments