కాటమరాయుడు గురించి లీక్ చేసిన శృతి

Friday, February 24th, 2017, 12:10:13 PM IST


కాటమారాయుడు సినిమా గురించి రెండు రకాల డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఒకటి ఆ సినిమా తమిళ చిత్రం వీరం కి రీమేక్ ఆ కాదా అని ఒక డిస్కషన్ అయితే మరొక పక్క ఆ సినిమా బిజినెస్ గురించి. బిజినెస్ సంగతి పక్కన పెడితే ఆ సినిమా వీరం రీమేక్ కాదు అంటున్నారు నిర్మాతలు కానీ డైలాగుల దగ్గర నుంచీ ఆహార్యం అన్నీ ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తున్నాయి. కానీ స్వయంగా శృతి హాసన్ ఈ సినిమా కాటమరాయుడు రీమేక్ కాదు అనే స్పష్టం చేశ్తోంది. ఒరిజినల్ నుంచే తీసుకున్నా రీమేక్ ఏ కానీ చాలా మార్పులు చేసారు అనీ చెబుతోంది . గబ్బర్ సింగ్ సినిమా స్టైల్ లో మార్పులు ఎక్కువగా జరిగాయి అంటోంది శృతి .‘‘పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా స్పెషల్. అలాగే మా కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ కూడా. నా కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ మూవీ అది. దాని తర్వాత మళ్లీ మేం ‘కాటమరాయుడు’ సినిమాకు కలిసి పని చేశాం. ఈ సినిమా కూడా నాకు చాలా ప్రత్యేకం. ఇది రీమేకే అయినా.. ఒరిజినల్ లాగా ఉండదు. ఎవ్వరూ కూడా రీమేక్ సినిమా చేస్తున్నపుడు ఉన్నదున్నట్లు దించేయాలనుకోరు. చాలా మార్పులు చేసారు ” అంది ఆమె