పవన్ కోసం సూపర్ స్టంట్…హాలీవుడ్ రేంజ్ లో వీరమల్లు?

Tuesday, March 30th, 2021, 01:05:55 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో కూడా నటిస్తూ అటు ప్రజలకు, ఇటు అభిమానులకు చేరువ అవుతున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. హరి హర వీరమల్లు టైటిల్ గా ఇటీవల ఒక గ్లింప్స్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ను ఒక రేంజ్ లో చూపించ నున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా కోసం శ్యామ్ కౌశల్ అనే స్టంట్ మాస్టర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ధూమ్ 3, క్రిష్ 3 లాంటి సినిమాలకు పని చేసిన ఈయన ఇప్పుడు పవన్ కోసం హై సూపర్ స్టంట్ చేస్తున్నారు.

అయితే ఇదే విషయాన్ని దర్శకుడు క్రిష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఇందులో ఒక దొంగ గా కనిపించనున్నారు అని అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని క్రిష్ వచ్చే ఏడాది సంక్రాంతికు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక పక్క పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదల అయింది. ట్రైలర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.