బిగ్ బాస్2 : నాని హోస్టింగ్ పై యాంకర్ శ్యామల కామెంట్స్!

Thursday, July 26th, 2018, 12:45:01 PM IST

బిగ్ బాస్ 2 మొదట్లో కొంత వరకు నెగిటివ్ టాక్ ను తెచ్చుకుందని వార్తలు వచ్చాయి. ఇక రోజులు గడుస్తున్నకొద్దీ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య విభేదాలు షోపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక వారాంతరంలో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక నాని హోస్టింగ్ కూడా అభిమానులను ఆకర్షిస్తోంది, ఎన్టీఆర్ స్థాయిలో చేయడం లేదని మొదట్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ నాని తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

ఇకపోతే ఇటీవల హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శ్యామల నాని హోస్టింగ్ గురించి తనదైన శైలిలో ఒకరిని వివరించింది. ఎన్టీఆర్ నానిలను ఒకరితో మరొకరిని పోల్చలేము. ఎవరి స్టైల్ వారిది. నాని సినిమాలో ఒక పక్కింటి అబ్బాయిలా కనిపిస్తారు. కొంత వరకు ఈ షోలో కోటులో కనిపించేసరికి కొత్తగా అనిపిస్తున్నారని చెప్పారు. అలాగే కోటులో కన్నా పక్కింటి అబ్బాయిలానే నాని బాగున్నాడని లుక్స్ విషయంలో తప్ప మారే విషయంలో మార్పు లేదని చెబుతూ.. కోపం వస్తే తిడుతున్నారు.. నచ్చితే మెచ్చుకుంటుంటున్నారని శ్యామల తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments