” నా కొడుకుని కావాలనే చంపేశారు ” తల్లి ఆవేదన

Friday, November 4th, 2016, 10:57:27 AM IST

semi
మధ్య ప్రదేశ్ పోలీసులు తన కొడుకు ని అకారణంగా చంపేశారు అని సిమీ ఉగ్రవాది మజీబ్ జమీల్ షేక్ తల్లి ముంతాజ్ అంటోంది. తన కొడుకు అసలు ఉగ్రవాది కాదు అనీ కావాలనే ఎన్ కౌంటర్ చేసి చంపేశారు అని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కోల్డ్ బ్లడ్ మర్డర్ గా ఆమె అభివర్ణించడం విశేషం. 2008 లో అహ్మదాబాద్ లో జరిగిన పేలుళ్ళలో మజీబ్ నిందితుడు గా రుజువు అయ్యింది. ఈ ఘటన లో యాభై ఆరు మంది చనిపోయారు. భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న ముజీబ్ సహా మరో ఏడుగురు ఉగ్రవాదులు సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. తమ అధీనంలో ఉన్న 8మందిని పోలీసులు ఓ వాహనంలో ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తీసుకొచ్చినట్టు కొందరు తనతో చెప్పారని ముంతాజ్ పేర్కొన్నారు. వారు ఉగ్రవాదులని పోలీసులు స్థానికులతో చెప్పారని తెలిపారు. యువకులు సాయం కోసం అరుస్తుంటే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేశారని భోపాల్ ప్రజలు తనతో చెప్పినట్టు ఆమె వివరించారు. ముజీబ్ దోషిగా తేలలేదు కాబట్టి అతడిని ఉగ్రవాదిగా చిత్రీకరించొద్దని ముంతాజ్ మీడియాను అభ్యర్థించారు. తన కొడుకు ముజాహిదీన్ అని, అమరుడని ఆమె పేర్కొన్నారు.