ర‌జినీతో సిమ్ర‌న్‌, సేతుప‌తితో కీర్తి?

Thursday, May 24th, 2018, 12:45:27 PM IST

ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సిమ్ర‌న్ గురించి ప‌రిచ‌యం అఖ్క‌ర్లేదు. బెస్ట్ పెర్ఫామ‌ర్‌… అంత‌కుమించి బెస్ట్ డ్యాన్స‌ర్. ఈ భామ న‌టించిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు చిత్రాల్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. ఆ సినిమాల్లో స్పైసీ సిమ్ర‌న్ ఇప్ప‌టికీ కుర్ర‌కారు క‌ల‌ల్లో క‌నిపిస్తుంది.
అయితే గ‌త కొంత‌కాలంగా సిమ్ర‌న్ లైమ్‌లైట్‌లో లేనేలేదు. సినిమాల‌కు బ‌హుదూరం అయ్యింది. వివాహానంత‌రం సినిమాల‌కు దూర‌మైంది. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌లి కాలంలో సిమ్ర‌న్ రీఎంట్రీ గురించి త‌మిళ‌నాడులో తామ‌ర‌తంప‌ర‌గా వార్త‌లొస్తున్నాయి.

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించ‌నున్న‌ 162వ సినిమాలో సిమ్ర‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. కార్తీక్ సుబ్బ‌రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదే చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అత‌డి స‌ర‌స‌న కీర్తి సురేష్‌ని ఎంపిక చేయ‌నున్నార‌ని ఓ స‌మాచారం లీకైంది. సిమ్ర‌న్ లాంటి సీనియ‌ర్ న‌టి, కీర్తి లాంటి న‌వ‌త‌రం నాయిక ఒకే సినిమాలో న‌టిస్తుండ‌డం అందునా ర‌జ‌నీ లాంటి సూప‌ర్‌స్టార్ సినిమాలో న‌టించ‌డంపై వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments