దసరా నుంచి పధకాలు అమలుచేస్తాం

Wednesday, September 10th, 2014, 08:06:46 PM IST


కాంగ్రెస్ పార్టీ తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని… కాంగ్రెస్ మాటలు నమ్మవద్దని.. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పధకాలను రుపొందించిందని.. అవన్నీ దసరా నుంచి అమలులోకి వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు నర్సాపూర్ సభలో వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు ఎంతో తనకు తెలుసనీ..తానూ ఒక వ్యవసాయదారుడినేనని అన్నారు. రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండ నెరవేరుస్తామని ఆయన మరోసారి హామీ ఇచ్చారు. పేదల కష్టాలు కాంగ్రెస్ పార్టీకి తెలియవని.. ఆయన అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ రుణమాఫీని మూడు జిల్లాలకే పరిమితం చేసిందని.. కాని రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం తాము దశల వారీగా మిగతా జిల్లాలకు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళ దొంగల సంగతి తేలుస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని కెసిఆర్ ఆరోపించారు. తాము గతంలో చెప్పినట్టుగానే, దళితులకు మూడెకరాల భూమి, మూడేళ్ళలో 24 గంటల విద్యుత్తును అందజేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.