తమ్ముడి కోసం అన్న త్యాగం .. ?

Friday, September 16th, 2016, 03:07:02 PM IST

karthi-surya
కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకున్నారో ఈ ఇద్దరు సోదర హీరోలు .. టాలీవుడ్ లోకూడా అచ్చంగా అలాంటి గుర్తింపే పొందారు. వారిద్దరి సినిమాలు రెండు భాషల్లోనూ భారీగా రిలీజ్ చేస్తారు. ఈ పాటికే ఆ ఇద్దరు హీరోలు ఎవరో అర్థం అయి ఉంటుందిగా ? అవును.. వారిద్దరే హీరోలు సూర్య, కార్తీ లు. హీరో సూర్య ”24” సినిమా తరువాత కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. దాంతో మళ్ళీ మూడో సింగంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే అయన హరి దర్శకత్వంలో రూపొందుతున్న ”సింగం” సీక్వెల్ ”సింగం 3” విడుదలకు సిద్ధం అవుతుంది. సింగం సీక్వెల్ లో ముందు రెండు సినిమాలకన్నా ”సింగం 3” భారీగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రాన్నీ దీపావళి కి ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు హీరో కార్తీ .. కూడా ”కాష్మోరా” అంటూ భిన్నమైన సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ క్రేజ్ ని క్రియేట్ చేసాయి. గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కూడా దీపావళికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు ? కోలీవుడ్ లో దీపావళి అంటేనే సినిమాల సందడి. కాబట్టి ఆ పండగకు విడుదల చేయలనీ చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే తమ్ముడికి పోటీ ఉండొద్దనే ఉద్దేశంతో సూర్య తన ”సింగం 3” చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడట, ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారట !! నిజానికి అంతమంచి పండగ సీజన్ ను త్యాగం చేయడం నిజంగా గొప్ప విషయమే. మొత్తానికి తన తమ్ముడికి పోటీ ఉండొద్దని భావించిన సూర్య మూడో సింగంని పోస్ట్ పోన్ చేసాడు. మరి అన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని తమ్ముడు ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి !!