కబాలికి ధీటుగా సత్తా చూపిన మూడో సింగం !!

Thursday, November 10th, 2016, 11:09:52 AM IST

singam2
హీరో సూర్య నటిస్తున్న ”సింగం 3” సినిమా విడుదలకు ముందే సత్తా చాటేలా ఉంది. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్స్ దుమ్ము లేపుతుంది? ఇప్పటికే విడుదలైన ‘సింగం’ రెండు భాగాలూ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ రజని ‘కబాలి’ ట్రైలర్ తో గట్టి పోటీ పడింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే .. ఏకంగా 3 మిలియన్ క్లబ్ లో చేరింది. సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన ‘కబాలి’ ట్రైలర్ కూడా విడుదలైన 24 గంటల్లో 3 మిలియన్స్ వ్యూ ని దాటేసి సంచలనం రేపింది. కబాలి తరువాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ విషయంలో భారీ హైప్ క్రియేట్ అయిందట !! ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 19న విడుదల చేయనున్నారు.