కిలాడీకే థ్రెట్‌గా మారిన క్రేజీ యంగ్ హీరో!

Sunday, October 22nd, 2017, 04:11:25 PM IST

బాలీవుడ్‌లో ఎదురేలేని హీరోగా దూసుకుపోతున్నాడు కిలాడీ అక్ష‌య్ కుమార్‌. ఇటీవ‌లి కాలంలో వ‌రుస ప‌రాజ‌యాల‌తో బెంబేలెత్తిన బాలీవుడ్‌ని తానున్నానంటూ ఆదుకున్నాడు. టాయ్‌లెట్ మూవీతో చ‌క్క‌ని విజ‌యం అందించి, అప్ప‌టికే బెంబేలెత్తిన‌ ట్రేడ్‌లో న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు. అలాంటి క్రేజీ హీరోకే థ్రెట్‌గా మారుతున్నాడు ఓ యంగ్ హీరో. అంతెందుకు అక్ష‌య్ న‌టించాల్సిన సీక్వెల్ సినిమాని త‌న ఖాతాలో వేసుకుని త‌నో ఆల్ట‌ర్నేట్ ఆప్ష‌న్ అని ప్రూవ్ చేస్తున్నాడు.

ఇంత‌కీ విష‌యం ఏమంటే… కిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టించిన `సింగ్ ఈజ్ కింగ్` 2008లో బ్లాక్బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. అనీష్ బ‌జ్మి ద‌ర్శ‌క‌త్వంలో శైలేంద్ర సింగ్ నిర్మించిన ఈ సినిమా అక్ష‌య్‌కి మంచి పేరు తెచ్చింది. నిర్మాత‌లు భారీగానే లాభాలు క‌ళ్ల‌జూశారు. ఇక ఇటీవ‌లి కాలంలో ఈ సినిమా సీక్వెల్ గురించి ముచ్చ‌ట సాగుతోంది. సింగ్ ఈజ్ కింగ్ -2 తెర‌కెక్కించేందుకు శైలేంద్ర స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి ఎంచుకున్న క‌థ‌కు ట్యాలెంటెడ్ యంగ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ అయితే సూట‌బుల్ అని భావించి ఎంపిక చేసుకున్నారుట‌. అయితే టైటిల్ మాత్రం సేమ్ ఉండ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ద‌ర్శ‌కుడు విపుల్ షా సూచ‌న మేర‌కు షేర్ కింగ్ అనే టైటిల్‌ని ఎంపిక చేసుకున్నారుట‌. సింగ్ అనే కామ‌న్ వ‌ర్డ్ ఉంటూనే, ఈ ఫ్రాంఛైజీలో వ‌రుస‌గా సినిమాలొస్తాయ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. షేర్ సింగ్ టైటిల్ ర‌ణ‌వీర్‌కి యాప్ట్‌గా ఉంది. అయితే పార్ట్ 2లో అక్ష‌య్‌ని ర‌ణ‌వీర్‌తో రీప్లేస్ చేయ‌డంతో స‌ద‌రు యంగ్ హీరో క్రేజు గురించి యూత్‌లో చ‌ర్చ సాగుతోంది. ర‌ణ‌వీర్ ఇప్ప‌టికే ప‌ద్మావ‌తి చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గళ్లీ బోయ్‌`, రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో `టెంప‌ర్` రీమేక్ ఇప్ప‌టికే క్యూలో ఉన్నాయి. ఈ లైన‌ప్ చూస్తుంటే.. వాటే క్రేజీ గ‌య్ ర‌ణ‌వీర్ ? అంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments