నిర్మాత‌ల‌కు కేంద్రం నుంచి గుడ్‌న్యూస్‌

Saturday, September 17th, 2016, 02:42:55 PM IST

talasani-srinivas-yadhav
షూటింగుల‌కు అనుమ‌తులు అన్న‌ది అన్నివేళ‌లా బిగ్ టాస్క్‌. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మంచి చొర‌వే చూపిస్తోంది. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ చొర‌వ చూపించి సింగిల్ విండో విధానాన్ని సీఎం కేసీఆర్ వ‌ద్ద ఓకే చేయించుకున్నారు. ఒకేచోట అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం.. అది కూడా సినిమా షూటింగుల‌కు ఈ స‌ద‌వ‌కాశం. మ‌న నిర్మాత‌ల చెవిలో అమృతం కురిపించే వార్తే. అయితే ఇవి రాష్ట్రాల ఇన్‌సైడ్ మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

దేశంలో ఏ ఇత‌ర చోట్ల‌కు వెళ్లినా లొకేష‌న్ ప‌ర్మిష‌న్స్ క‌ష్ట‌మే కదా! అందుకు ఎవ‌రు సింగిల్ విండో అనుమ‌తులివ్వాలి? అంటే కేంద్ర ప్ర‌భుత్వం చేతిలో ఉంది అస్త్రం. అయితే లొకేష‌న్ ప‌ర్మిష‌న్ల విష‌యంపై స‌మ‌గ్రంగా ప‌రిశీలించిన కేంద్రం ఇక సింగిల్ విండో ప్రాతిప‌దిక‌న అనుమ‌తులు ఇచ్చేందుకు రెడీ అవుతోందిప్పుడు. ఈ విష‌యంపై పార్ల‌మెంటులో బిల్లు పెట్టేందుకు రెడీ అవుతున్నారుట‌. ఈ విష‌యాన్ని కేంద్ర స‌హాయ మంత్రి స‌ఖ్వీ తెలియ‌జేశారు. ఇది టాలీవుడ్ నిర్మాత‌ల‌కు నిజంగానే గుడ్ న్యూస్‌.