అర్జున్‌రెడ్డి 2తో జీవిత రెండో డాట‌ర్‌

Thursday, July 26th, 2018, 11:46:42 AM IST

అర్జున్‌రెడ్డి ఘ‌న‌విజ‌యంతో విజ‌య్ దేవ‌ర‌కొండ రేంజ్ స్కైని ట‌చ్ చేసింది. ఆ క్ర‌మంలోనే దేవ‌ర‌కొండ వ‌రుస క‌మిట్‌మెంట్ల‌తో బిజీ అయిపోయాడు. ఓవైపు తాను బిజీగా ఉంటూనే సోద‌రుడు ఆనంద్ వెండితెర‌ ప‌రిచ‌యం గురించి సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నాడు. తాజాగా ఆనంద్ డెబ్యూ సినిమా స‌మ‌చారం అందింది. దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు `పెళ్లి చూపులు` త‌ర‌హా ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించనున్నార‌ని తెలుస్తోంది. దొర‌సాని అనే టైటిల్ లీకైంది.

అంతేకాదు.. ఈ సినిమాతో జీవిత కుమార్తె శివానీ సోద‌రి శివాత్మిక వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతుండ‌డం హాట్ టాపిక్‌. జీవిత 2లా అచ్చం మ‌మ్మీ పోలిక‌ల‌తో క‌నిపించే శివాత్మిక ఆనంద్ స‌ర‌స‌న న‌టిస్తోందిట‌. ఈ క్రేజీ సినిమాకి కెవిఆర్ మ‌హేంద్ర అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది. శివానీ ఇప్ప‌టికే అడ‌వి శేష్ స‌ర‌స‌న `గూఢ‌చారి` చిత్రంలో న‌టిస్తోంది. త‌మిళంలోనూ అదృష్టం చెక్ చేసుకుంటోంది. ఇప్పుడు త‌న గారాల చెల్లాయి క‌థానాయిక‌గా ల‌క్ చెక్ చేసుకోబోతోంద‌న్న‌మాట‌. ఒక కొత్త జంట‌ను తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ సురేష్‌బాబు ధ‌న్యుడ‌వుతున్నారు మ‌రి!

  •  
  •  
  •  
  •  

Comments