ట్రైలర్ టాక్ : స్కైస్క్రాప‌ర్ ట్రైల‌ర్ 2 ఇంట్రెస్టింగ్‌

Thursday, May 24th, 2018, 12:37:14 PM IST

బేవాచ్ పేం రాక్ అలియాస్ డ్వేన్ జాన్స‌న్ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ ప్రపంచ‌వ్యాప్తంగా అభిమానుల్ని అల‌రిస్తున్నాడు. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం స్కైస్క్రాప‌ర్ ట్రైల‌ర్ ఇదివ‌ర‌కూ రిలీజై ఆక‌ట్టుకుంది. ఇప్పుడు రెండో ట్రైల‌ర్‌ని లాంచ్ చేశారు. ఈ ట్రైల‌ర్ రియ‌ల్లీ మైండ్ బ్లోయింగ్ అన్న టాక్ వినిపిస్తోంది. భారీ యాక్ష‌న్ విన్యాసాలు, సాహ‌సోపేత‌మైన పీట్‌తో రాక్ అద‌ర‌గొట్టేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఈ భారీ హీరో చాలానే రిస్కీ ఫైట్స్ చేసిన‌ట్టు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఆర్మీ అధికారి అయిన డ్వేన్ త‌న‌ కుటుంబాన్ని ప్ర‌మాదం నుంచి ర‌క్షించుకునేందుకు ఏం చేశాడ‌న్న‌ది ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. `స్కైస్క్రాప‌ర్‌` ట్రైల‌ర్ భారీ సాహ‌స‌విన్యాసాల‌తో ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తోంది. ఎత్త‌యిన భ‌వంతుల‌పై ఆకాశాన్ని తాకుతున్న బంగ్లాలపై భారీ యాక్ష‌న్ సీన్స్ మ‌తి చెడ‌గొడుతున్నాయ‌. టెక్నాల‌జీ ప‌రంగానూ మ‌రో లెవల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఓ ఆర్టిఫిషియ‌ల్ కాలు తో డ్వేన్ పోరాటాలు మైమ‌రిపిస్తున్నాయి. రెండో ట్రైల‌ర్ రాక్ సాలిడ్. జూలై 13న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇండియాలో హాలీవుడ్ సినిమాల వెల్లువలో ఈ చిత్రం బంప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments