244వ అంత‌స్తులోంచి దూకేసిన స్టార్ హీరో!

Monday, February 5th, 2018, 03:25:12 PM IST

డ్వేన్ జాన్స‌న్ న‌టించిన `జుమాంచి 3డి` ఇటీవ‌లే రిలీజై ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంప‌ర్ క‌లెక్ష‌న్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే. తెలుగులోనూ అనువాద‌మై మ‌న ఆడియెన్‌ని అబ్బుర‌ప‌రిచింది. బేవాచ్ లాంటి ప‌రాజ‌యం త‌ర్వాత డ్వేన్‌కి ఇది చ‌క్క‌ని ఊర‌ట‌నిచ్చిన సినిమా. అయితే డ్వేన్ న‌టించిన తాజా చిత్రం `స్కైస్క్రాప‌ర్‌` త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది.

తాజాగా ట్రైల‌ర్‌ని లాంచ్ చేశారు. ట్రైల‌ర్ ఫెంటాస్టిక్ అన్న టాక్ వ‌చ్చింది. అంతుచిక్క‌ని సాహ‌స‌విన్యాసాల‌తో భారీ యాక్ష‌న్ తో ఈ ట్రైల‌ర్ అభిమానుల్ని అల‌రిస్తోంది. ఇందులో డ్వేన్ ఎఫ్‌బిఐ ఏజెంట్ గా సాహ‌స‌విన్యాసాలు చేయ‌నున్నాడు. ట్రైల‌ర్‌లో అత‌డి సాహ‌సాలు అసాధార‌ణం. ఓ భారీ భ‌వంతిలో 244వ‌ అంత‌స్తులో ఉన్న త‌న ఫ్యామిలీని ర‌క్షించుకునేందుకు డ్వేన్ చేసిన జంప్ హైలైట్‌గా ఉంది. ఓవైపు భారీ విస్పోట‌నం.. తుపాకుల‌తో త‌న‌పై ఫైరింగ్ చేస్తుంటే .. అంత పెద్ద భ‌వంతి పైనుంచి సూప‌ర్‌మేన్‌లా జంప్ చేస్తున్న దృశ్యం మిరాకిల్ అనిపిస్తోంది. అంతేకాదు.. ఇందులో ఒకే కాలుతో ఉండే హీరో.. మెటాలిక్ లెగ్‌తో మేనేజ్ చేసేయ‌డం ఎలా? అన్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మెటాలిక్ లెగ్ సాయంతోనే ఆ భారీ జంజ్‌లో బ‌తికి బ‌య‌ట‌ప‌డ‌తాడు. రీసెంట్ మూవీస్‌లో ఇలాంటి భారీ యాక్ష‌న్ ఉన్న‌ది వేరొక‌టి లేదు. డ్వేన్ మ‌రోసారి భారీ స‌క్సెస్‌ని అందుకుంటాడ‌ని అర్థ‌మ‌వుతోంది.