విడియో : బాహుబలి రికార్డ్ ను క్రాస్ చేసిన సల్మాన్

Saturday, November 11th, 2017, 06:47:23 PM IST

2017లో భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ విడుదలకు ముందే చాలా రికార్డులను నమోదు చేసింది. బాహుబలి 2 ట్రైలర్ అయితే సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో లైకులను అందుకుంది. అయితే బాహుబలిని నిన్నటి వరకు లైకులలో ఏ ట్రైలర్ దాటలేదు కానీ సల్మాన్ ఖాన్ చిత్రం ట్రైలర్ మాత్రం నాలుగు రోజుల్లోనే దాటేసింది.

మొత్తం బాహుబలికి హిందీ వెర్షన్ ట్రైలర్ కి ఇప్పటివరకూ 5,41,000 లైకులు వచ్చాయి. అయితే మంగళవారం రిలీజ్ అయినా సల్మాన్ టైగర్‌ జిందాహై మాత్రం 7,27,000 లైకులు దాటాయి. ఇంకా ఆ సంఖ్య పెరుగుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో లైకులు అందాయంటే సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  •  
  •  
  •  
  •  

Comments