తెలంగాణ హెల్త్ బులెటిన్‌లో మార్పులు.. కారణం అదే..!

Sunday, July 26th, 2020, 03:00:41 AM IST


తెలంగాణలో కరోనా వైరస్ ఉదృత్తి ఎక్కువగానే ఉంది. లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చినప్పటి నుంచి కేసుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అయితే టెస్టుల విషయంలో ఎందుకు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని, కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలు పొందుపరచడం లేదని, ఆసుపత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్ట్ ప్రభుత్వంపై మండిపడుతూ వచ్చింది.

అయితే తాము అన్ని నిబంధనలు సరిగ్గానే ఫాలో అవుతున్నామని ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రతి రోజూ విడుదల చేస్తున్న కరోనా బులెటిన్‌ను నేడు విడుదల చేయలేదు. రేపటి నుంచి కొత్త ఫార్మెట్‌లో బులెటిన్ విడుదల చేస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలిపారు. అయితే కోర్టు చీవాట్లు పెడుతుండడంతోనే ప్రభుత్వం బులెటిన్‌లో మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది.