ఫోటో టాక్‌: న‌వ్వ‌డం ఒక భోగం

Sunday, September 2nd, 2018, 11:49:06 PM IST


నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం! అన్నాడో మహాకవి.. నవ్వు మనిషి తనకు తాను అద్భుతంగా తయారు చేసుకునే అద్భుత సౌందర్య సాధనం! ఇదిగో మెహ్రీన్ అంతందంగా ఎందుకుంటుందో ఈ న‌వ్వు చూశాక మీరే చెప్పండి.

ఒక‌డుగు ముందుకు ప‌డితే, నాలుగ‌డుగులు వెన‌క్కి ప‌డుతూ ఫ్లాపులొస్తున్నా.. ఈ పాల‌బుగ్గ‌ల చంద‌మామ కెరీర్ ప‌రంగా త‌డ‌బ‌డుతూనే ఉన్నా ఇలా హాయిగా ఎలా న‌వ్వ‌గ‌లుగుతోంది? తొంద‌ర్లోనే ఎఫ్ 2 రిలీజ్‌కి రాబోతోంది. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించింది. అలానే దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `నోటా` చిత్రంలో న‌టించింది. వీటిలో ఒక‌టి ద‌స‌రాకి, వేరొక‌టి సంక్రాంతికి రిలీజ్‌కి రానున్నాయి. ఈ రెండిటితో హిట్లు కొడితే చాలు.. మెహ్రీన్ కెరీర్ మ‌రో నాలుగైదేళ్లు ఎదురే లేకుండా దూసుకెళుతుంది.

అయితే మెహ్రీన్‌కి త‌న కెరీర్ గురించి మ‌న‌కు ఉన్నంత టెన్ష‌న్ ఉన్న‌ట్టే క‌నిపించ‌డం లేదు. ఇదిగో ఇక్క‌డ ఎంత హాయిగా న‌వ్వేస్తోందో! కెరీర్‌దేముందిలే ఈ క్ష‌ణం ఆనందంగా ఉంటే చాలు! అని భావించిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే ఆ ముఖార‌విందం చంద్ర‌బింబాన్ని పోలి.. వెన్నెల‌లు కురిపిస్తోంది. బోయ్స్‌ని ఇట్టే టెంప్ట్ చేస్తోంది. అలా గ్రౌండ్‌పై ప‌డి మ‌రీ ప‌క‌ప‌కా న‌వ్వేస్తోందేంటో! ఆ న‌వ్వు చూసి ప‌డిపోయిన కుర్ర‌కారు.. ఐ ల‌వ్ యు.. బ్యూటిఫుల్ స్మైల్‌.. ల‌వ్ యు రా.. అంటూ కొంటెగా కామెంట్లు పోస్ట్ చేశారు. న‌వ్వితే రోగాలు మ‌టుమాయం అగును. న‌వ్వు భోగం… న‌వ్వించ‌డం ఒక యోగం! అని అన్నారు అందుకే..

  •  
  •  
  •  
  •  

Comments