సింగర్ కారణంగా 900 కోట్లు నష్టపోయిన స్నాప్ చాట్!

Sunday, March 18th, 2018, 08:45:29 PM IST

ఈ రోజుల్లో సోషల్ మీడియాను జనాలు ఏ స్థాయిలో వాడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ తారలు కూడా అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నారు. వారి సినిమాలకు సంబందించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఈ మధ్య ఓ సోషల్ మీడియా సంస్థ చేసిన కొంటె పనికి దాదాపు 900 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది. పాప్ సింగర్ చేసిన ఓ కామెంట్ కారణంగా స్నాప్‌చాట్‌ కంపెనీ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. గతవారం స్నాప్‌చాట్‌ సంస్థ పాప్ సింగర్ లవ్ ఎఫైర్ కి సంబందించిన యానిమేటెడ్‌ వీడియోగేమ్‌ ను రూపొందించింది. అయితే అది తనను కించపరిచేలా ఉందని పాప్ సింగర్ రిహన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఆ యాప్ ని డిలీట్ చేయమని తన అభిమానులకు పిలుపునిచ్చింది. దీంతో ఒక్కసారిగా స్నాప్ చాట్ యూజర్స్ రేటింగ్ తగ్గిపోయింది. ఆ కారణంగా ఆ కంపెనీ సిఈవో ఇవాన్‌ స్పైగల్‌ సంపద దాదాపు 150 మిలియన్‌ డాలర్లు నష్టపోవాల్సి వచ్చింది.