డీలా పడిపోయిన స్నాప్ డీల్..30 శాతం ఉద్యోగులు అవుట్..!

Sunday, February 12th, 2017, 08:44:15 PM IST


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ పెద్ద కుదుపు కు లోను కానుంది. 30 శాతం ఉద్యోగులను ఆసంస్థ తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రభావంతో దాదాపు వెయ్యిమంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోనున్నారు. కాగా వేలాదిగా లాజిస్టిస్ విభాగంలో కాంట్రాక్ట్ ద్వారా పని చేస్తున్న వారి ఉద్యోగాలు కూడా పోనున్నాయి.

ఈ సంస్థ ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. పెట్టుబడులు రాకపోవడం, వాల్యుయేషన్స్ క్షిణించడంతో ఈ సంస్థ ఇబందుల్లో పడిందని అంటున్నారు. దీనితో ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మేనజర్లందరికి ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా స్నాప్ డీల్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మధ్య కాలంలో స్నాప్ డీల్ రూ30 కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలుస్తోంది.