పవన్ విషయంలో మరోసారి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియా!

Wednesday, November 13th, 2019, 08:04:17 PM IST

తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో జనసేన పార్టీ మరియు వైసీపీ పార్టీల నడుమ పెద్ద తగాదాలే నడుస్తున్నాయి.పవన్ ఒక మాట అంటే అసలు విషయాన్ని వదిలేసి ఎందుకు పనికి రాని మాటలను పట్టుకొని వాటిని కావాలని హైలైట్ చేస్తూ వైసీపీ శ్రేణులు సగటు సామాన్యునికి విసుగు తెప్పిస్తున్నారు.అయితే గత ఆదివారం పవన్ ఇసుక కొరత విషయం పై దాదాపు లక్షన్నర మంది జనంతో విశాఖలో లాంగ్ మార్చ్ చేసి ఓటమి పాలైన తర్వాత కూడా ఈస్థాయి ఆదరణ తెచ్చుకోవడం సాధ్యమా అని అనుకున్న వారితో ముక్కున వేలేయించారు.

అదే రోజున వైసీపీ పార్టీ పాలసీలపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.అయితే అదే రోజున పవన్ అఖిల పక్షం పేరిట అన్ని పార్టీలకు కూడా పిలుపునివ్వగా అక్కడ విశాఖకు దగ్గరగా ఉండే నేతలు అయినటువంటి అచ్చెన్నాయుడు మరియు అయ్యన్నపాత్రుడు వచ్చారు.మళ్ళీ రేపు నవంబర్ 14న చంద్రబాబు ఇసుక కొరతపై చెయ్యబోయే దీక్ష నిమిత్తం జనసేన పార్టీ తరపున పవన్ మద్దతు కూడా కావాలని అతన్ని ఆహ్వానించడానికి ఇదే అచ్చెన్నాయుడు మరియు వర్ల రామయ్యలు పవన్ ను కలిసి ఆహ్వానించారు.

ఇక అంతే ఇప్పుడు నుంచి మన సో కాల్డ్ మీడియా మొదలు పెట్టారు అసలు రచ్చ ఇంకా అఆ లు కూడా నేర్చుకోలేదు కానీ వేమన పద్యం చెప్తాను అన్నట్టు ఇంకా పవన్ దీనిపై ఎలాంటి స్పందననూ ఇవ్వకపోయినా సరే పవన్ చంద్రబాబు దీక్షకు వెళ్లిపోయారు అన్న రేంజ్ లో ఒకనాడు అసలు పవన్ మొహం చూపించని వారు కూడా ఈరోజు వార్తలలో బాబు న్యూస్ కాబట్టి పవన్ వచ్చేస్తున్నారు అన్న రేంజ్ లో ప్రసారం చేస్తున్నారు.ఇక వీరు ఎప్పుడు మారుతారో ఏంటో..