ఈ కంగారూని చూస్తే కంగారు గ్యారెంటీ!

Friday, September 14th, 2018, 07:18:26 PM IST

బుజ్జి బుజ్జి ప‌ప్పీలు, క్యూట్ క్యూట్ పిల్లి కూన‌ల‌తో ఆడుకోవ‌డంలో ఉండే థ్రిల్లే వేరు. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ కంగారూ కిడ్‌ని చూస్తుంటే అంతే ముచ్చ‌టేస్తోంది. వ్వావ్! సో క్యూల్ ల‌వ్‌లీ కంగారూ చిట్టీ! అంటూ ముద్దాడేయాల‌నిపిస్తోంది. ఈ కంగారూ పేరు బ్రాడ్‌లీ. ఆస్ట్రేలియాలోని ఓ జంతు సంర‌క్ష‌ణ శాల‌లో ఇది పెరుగుతోంది. కేవ‌లం ఆస్ట్రేలియా ఖండంలో మాత్ర‌మే క‌నిపించే అరుదైన‌ జీవి కంగ‌రూ.

మ‌న ఇళ్ల‌లో ఆవులు, మేక‌లు, కుక్క పిల్లలు ఎలా అంద‌రితో క‌లిసిపోయి జీవిస్తాయో.. ఆస్ట్రేలియా దేశంలో అంతే ఇదిగో మ‌నుషుల‌తో క‌లిసిపోయి జీవించే సాధు ప్రాణులు ఇవి. ఒక పెద్ద కంగారూ ఏడ‌డుగుల ఎత్తు ఉంటుంది మినిమం. మ‌నిషిలానే దానికి రెండు చేతులు, రెండు కాళ్లు ఉంటాయి… మ‌నిషిలానే నిల‌బ‌డుతుంది. ప‌చ్చిక‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటుంది. ఇది పూర్తిగా శాఖాహారి. దానికి బ‌ల‌మైన తోక ఓ పెద్ద సంర‌క్ష‌ణ‌. జంతువుల్లో ఇది ఎంతో తెలివైనది అని అంటారు. త‌మ బిడ్డ‌ను పొట్ట కిందుగా సంచిలాంటి ప్లేస్‌లో పొదుపుగా దాచుకుని ఇది సాకుతుంది. పెరిగి పెద్ద‌ది అయ్యేవ‌ర‌కూ సంర‌క్షిస్తుంది. ఇటీవ‌లే బాలీవుడ్ క‌థానాయిక ప‌రిణీతి చోప్రా సైతం కంగారూ దేశానికి వెళ్లి అక్క‌డ కంగారూల‌తో స్నేహం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయ్యాయి.
మ‌నిషి అంత‌కంత‌కు క్రూరంగా, వికృతంగా మారిపోతున్న ఈ రోజుల్లో పెట్స్‌తో స్నేహానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ఆస్ట్రేలియ‌న్లు కంగారూల్ని పెంచుకుని వాటితో స్నేహం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.

  •  
  •  
  •  
  •  

Comments