నా డబ్బు తీసుకున్న ఎంతో మంది మోసం చేసారు : ప్రముఖ టాలీవుడ్ హీరో

Sunday, April 1st, 2018, 12:11:29 PM IST

స్వప్న లోకం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఒకప్పటి ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తనయుడు జగపతి బాబు. ఒకప్పుడు ఫామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అయినా ఆయన ప్రస్తుతం హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నారు. ఈ తరం విలక్షణ నటుల్లో ఒకరిగా నిలిచిన జగపతిబాబు నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘రంగస్థలం’ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబడుతున్న సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఒకప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నానని, అందుకు కేవలం తన అలవాట్లు మాత్రమే కారణం కాదని, తన నుంచి డబ్బు తీసుకున్నవాళ్లు ఎంతో మంది మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తప్పు తనదేనని, తాను మోసపోయానని, సినిమా కారణంగా దెబ్బతిన్నానని చెప్పిన ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకుని, తన వద్ద ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నానని చెప్పారు. తాను క్యాసినోలకు వెళ్లి జూదం ఆడటం వల్లే డబ్బును కోల్పోయినట్టు పలువురు భావిస్తున్నారని, అయితే అది అవాస్తవమని చెప్పారు.

గతంలో డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేశానని, ఇప్పుడు విలువ తెలుసుకుని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నానని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడటం తన మంచికే జరిగిందని అనుకుంటున్నానని, ఆ స్థితిని స్వయంగా అనుభవించడం వల్లే తిరిగి నిలబడగలిగానని అన్నారు. అయితే ఇప్పటివరకూ ఏ దర్శకుడినీ తనతో సినిమా చేయమని తాను అడగలేదని, నేను చేయగల పాత్ర ఉంటే వారే నా వద్దకు వస్తున్నారని అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments