బిగ్ బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యేలలో తీవ్ర నిరాశ.. అదే కారణమా..!

Sunday, June 9th, 2019, 07:05:30 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే జగన్ కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారని ఇన్ని రోజులు ఆసక్తిగా ఎదురు చూసిన వారందరికి నేటితో కాస్త ఊరట లభించింది. ఎట్టకేలకు చెప్పినట్టుగానే నేడు 25 మంది మంత్రులతో జగన్ ప్రమాణస్వీకారం చేయించేసారు. అయితే అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేకూరేలా ఉండాలని సీఎం జగన్ తన మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి 6, బీసీలకు 7, కాపులకు 4, కమ్మ సామాజిక వర్గానికి 1, క్షత్రియ సామాజిక వర్గానికి 1, ఎస్సీలకు 4, ఎస్టీ లకు 1, ఆర్య వైశ్య 1, మైనారిటీ సామాజిక వర్గానికి 1 చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. అంతేకాదు తన కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. అయితే ఇప్పుడు ఎన్నికైన మంత్రుల పదవి కాలం కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత పార్టీలో మిగిలిన వారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపట్ల అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలలో మాత్రం నిరాశ కనిపిస్తుంది. ఈ నిరాశకు కారణం జగన్ తీసుకున్న కారణం ఒకటైతే, తమకు మంత్రివర్గ స్థానంలో చోటు దక్కకపోవడం ఒక కారణమట. అందుకే మంత్రి పదవి ఆశించిన ఆశావాహ ఎమ్మెల్యేలంతా నేడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదట. అయితే గతంలో పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను కూడా జగన్ తప్పారని కొంత మంది ఎమ్మెల్యేలు అంటున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిలకలూరి పేటలో రజినీని గెలిపిస్తే ఎమ్మెల్సీ కోటాలో మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఖాయమని చెప్పారు జగన్. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, కడప జిల్లా నుంచి కొరముట్ల శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా నుంచి ఆర్కే రోజా, సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కర్నూలు జిల్లా నుంచి శిల్పా సోదరులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. నిన్నటి వరకు తమ పేర్లు లిస్ట్‌లో ఉంటాయని భావించిన వీరికి సీఎం జగన్ పెద్ద షాకిచ్చారనే చెప్పాలి. అయితే సీఎం జగన్ మాకు మాటిచ్చి మోసం చేశాడని నేడు మంత్రుల ప్రమాణస్వీకారానికి ఎవరు హాజరు కాలేదు. అయితే జగన్ హామీ ఇచ్చినా సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు పార్టీలో విప్ లుగా ప్రకటించిన వారు సైతం కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఈ విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.

అంతేకాదు రెడ్లు కూడా కాస్త జగన్ తీసుకున్న నిర్ణయంతో సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో టీడీపీ హయాంలో దాదాపు 10 మంది కమ్మ సామాజిక వర్గ మంత్రులు ఉండేవారు. మరీ అంత కాకపోయినా ఒక ఏడు మంది రెడ్లకు కేబినెట్‌లో స్థానం లభిస్తుందని అనుకున్న రెడ్ది సామాజిక వర్గం అలా జరగకపోవడంతో కాస్త నిరాశలో ఉన్నట్టు అర్ధమవుతుంది. అయితే ఇప్పుడే పార్టీలో ఇలా ఉంతే ఇంకా ముందు ముందు సీఎంగా జగన్ ఎలాంటి పరిస్థితులను ఎదురుకోవలసి వస్తుందో అంటూ ప్రతిపక్ష పార్టీలు దీనిపై లోతుగా చర్చించుకుంటున్నాయి.