క్రేజీ కొత్తజంట : కెమెరాకి చిక్కిన సోనమ్, ఆనంద్ జంట

Saturday, May 5th, 2018, 12:52:57 PM IST

బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్‌, ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ ఆహుజాల వివాహం మే 8న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. మే 7న సోన‌మ్ ఇంట మెహందీ సెర్మ‌నీ జ‌ర‌గ‌నుంది దీనికి సంబందించిన ఈవెంట్ ఆర్గనైజర్లు ఇప్పటికే అన్ని విధాలా సిద్దం చేసి ఉంచారు. అటు క‌పూర్ ఫ్యామిలీ, ఇటు ఆహుజా ఫ్యామిలీ అంతా మెహందీ ఈవెంట్‌లో తమ ఆట పాట‌ల‌తో అల‌రించ‌నున్నారు. అయితే అఫీషియ‌ల్ పెళ్ళి ప్ర‌క‌ట‌న త‌ర్వాత తొలిసారి సోన‌మ్ క‌పూర్‌, ఆనంద్ ఆహుజాలు కెమెరా కంటికి చిక్కారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న క్లినిక్ బ‌య‌ట క‌నిపించిన ఈ జంట‌ని ఫోటోగ్రాఫ‌ర్స్ త‌మ కెమెరాల‌లో బంధించారు.

ప్ర‌స్తుతం వీరి వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరిరువురి పెళ్లి జ‌ర‌గ‌నుండ‌గా, పెళ్ళి వేడుక‌కి ప్ర‌తి ఒక్క‌రు ఇండియ‌న్ ట్రెడిష‌న‌ల్ డ్రెస్ ధ‌రించి రావాల‌ని కోరారు క‌పూర్‌, అహుజా ఫ్యామిలీస్‌. సోన‌మ్ పెళ్ళికి బాలీవుడ్ అంతా తండోప తండాలుగా త‌రలిరానుంది . పెళ్లి త‌ర్వాత త‌న తాజా చిత్రం వీరే ది వెడ్డింగ్ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాల‌లో పాల్గొన‌నుంది సోన‌మ్‌. ఈ చిత్రం జూన్ 1న విడుద‌ల కానుంది. మ‌రోవైపు సంజూ చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్న సోన‌మ్ మే 14, 15 తేదీల‌లో కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్‌పై న‌డ‌వ‌నుంది.

Comments