తెలంగాణలో నేడు రేషన్ సరుకుల పంపిణీ.. సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ..!

Friday, March 27th, 2020, 01:00:54 AM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం రాష్ట్రమంతా లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే కరోనా దెబ్బతో ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతుండడంతో వారందరికి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది.

అయితే ఈ నేపధ్యంలో తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారందరికి ఉచితంగా బియ్యం, మరియు నిత్యవసర సరుకుల కొనుగోలుకై 1500 రూపాయల నగదు పేదవారికి అందించనున్నట్టు మొన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రేపటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తూ ప్రతి కార్డు దారుల కుటుంబానికి 1500 రూపాయలు అందించబోతుంది. అయితే సరుకులను తీసుకునేందుకు వచ్చే ప్రజలు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని ప్రభుత్వం విజ్ణప్తి చేసింది. అయితే ప్రజలకు అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తెలపాలని, ఎవరిని గుంపులుగా గుమ్మిగూడ కుండా చూడాలని అన్నారు.