పవన్ మాటల్ని మరో రకంగా అర్థం చేసుకున్నారు

Tuesday, June 11th, 2019, 11:34:54 AM IST

రెండు మూడు రోజుల క్రితం పవన్ పార్టీ నేతలతో, కార్యకర్తలతో ఎన్నికల ఫలితాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఒక వ్యక్తి జనసేనాని పార్టీని నడిపే పద్దతుల విషయంలో సలహాలు ఇవ్వగా పవన్ సదరు వ్యక్తిని ఓటు ఎవరికీ వేశావు అని అడగ్గా ఆటను వైకాపాకు అని చెప్పడంతో నాకు ఓటు వేయని నువ్వు పార్టీని ఎలా నడపాలో సహా ఇస్తున్నావ్, ఇక్కడున్న చాలండి నాకు ఓటు వేయలేదంటూ పవన్ మాట్లాడారు.

అంతేకాదు ఓటుకు 2000 తీసుకుని ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారని, 2000 అంటే ఐదేళ్ళలో రోజులు రూపాయి అని, గుడి వద్ద భిక్షాటన చేసేవారు కూడా అంతకంటే ఎక్కువ సంపాదిస్తారని అన్నారు. పవన్ మాట్లాడిన ఈ మాటల్లో అంతరార్థం డబ్బుకు ఓటును అమ్ముకోవద్దు అని. కానీ ప్రత్యర్థి వర్గాలు మాత్రం ఆ విషయాన్ని వదిలేసి పవన్ బిక్షాటన చేసేవాళ్ళని చులకనగా మాట్లాడారని, ప్రతిఒక్కరికీ అభిమానం ఉంటుందని, పవన్ ఆ సంగతి తెలుసుకోవాలని తెగ ఫైర్ అవుతున్నారు. వీటిని గమనించిన జనసేన కార్యకర్తలు అరటిపండులో పండును వదిలేసి తొక్కను తినడం అంటే ఇదే అంటూ ఎద్దేవా చేస్తున్నారు.