ఆ నిర్ణ‌యంతో వైఎస్ జ‌గ‌న్ కామెడీ చేస్తున్నారా?

Sunday, June 9th, 2019, 11:45:18 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం సోష‌ల్ మీడియాలో న‌వ్వుల పువ్వులు పూయిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆ నిర్ణ‌యంపై సోష‌ల్ మీడియాలో కుళ్లు జోకులు పేలుతున్నాయి. ఇంత‌కీ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఏమిటీ?. దానిపై ఎందుకు జోకులు పేలుస్తున్నారు. .. ఇటీవ‌ల జ‌గ‌న్ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని కులాల వారికి ప్ర‌ధాన్య‌త క‌ల్పిస్తూ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై స‌ర్వ‌త్నా ప్ర‌శంస‌లు ల‌భిస్తుంటే జ‌గ‌న్ తీసుకున్న మ‌రో నిర్ణ‌యానికి సోష‌ల్ మీడియాలో సెటైర్ల వ‌ర్షం కురుస్తోంది. ఇంత‌కీ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఏంటంటే ఐదు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు.

ఏ రాష్ట్రంలోనూ ఒక్క‌రు లేదా ఇద్ద‌రు మాత్ర‌మే ఉప ముఖ్య‌మంత్రులుంటారు. వారికి రాజ్యాంగ బ‌ద్ధంగా ఎలాంటి అధికార ద‌ర్ప‌మూ, హంగూ ఆర్భాట‌మూ వుండ‌దు. ఉప ముఖ్య‌మంత్రి అనేది అలంకార ప్ర‌య‌మే. ఏదో వున్నాడా అంటే పేరుకు వున్నాడ‌న్న‌ట్టే. అలాంటి ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల్ని ఐదుగురికి కేటాయించ‌డం విడ్డూర‌మే. అలాంకార ప్రాయంగా పిలువ‌బ‌డే ప‌ద‌వికి ఐదుగురిని ఎంపిక చేయ‌డం అన్న‌దే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కామెడీగా మారింది. ఈ ప‌ద‌వుల‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్ కామెడీ చేస్తున్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.