పిక్‌ టాక్‌ : హాటీ జిల్ జిల్ జిగేల్‌!

Friday, July 27th, 2018, 08:05:22 PM IST

1-నేనొక్క‌డినే సినిమాతో ఐటెమ్ భామ‌గా టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైంది సోఫీ చౌద‌రి. ఈ బాలీవుడ్ మోడ‌ల్ కం హాట్ హీరోయిన్ ప‌లు ఐటెమ్ నంబ‌ర్ల‌తో ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిని ఉర‌క‌లెత్తించింది. అయితే ఈ భామ కేవ‌లం ఐటెమ్‌ల‌కు మాత్ర‌మే సూట‌వ్వ‌డంతో సినిమా ఛాన్సులు జీరో అయిపోయాయ్‌. దాంతో ఎక్కువ‌గా ఫోటోషూట్లు, మోడ‌లింగ్ అసైన్మెంట్స్‌తోనే కెరీర్ బండి సాగిస్తోంది. ఇక‌పోతే రెగ్యుల‌ర్‌గా ద‌ర్శ‌కులంద‌రికీ ట‌చ్‌లో ఉండే ఈ భామ అప్ప‌ట్లో లిక్క‌ర్‌కింగ్‌, విలాస‌పురుషుడు విజ‌య్‌ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో గోవా బీచ్‌లో షికార్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

ఇదిగో రీసెంటుగా ఇలా జ‌ల్లెడ జ‌ల్లెడ డిజైన‌ర్ డ్రెస్‌లో ఓ ఊపు ఊపేస్తోంది. ఓ బిజినెస్‌మేన్ కం ప్రొడ్యూస‌ర్ బ‌ర్త్‌డే పార్టీలో ఇలా జిల్ జిల్‌మ‌నిపించింది. వేడి పెంచ‌డం అవ‌కాశాలు అందుకోవ‌డం ఈ అమ్మ‌డి స్టైల్‌. అందుకే ముంబై ఫేజ్ 3 పార్టీల్లో ఈ అమ్మ‌డు లేకుండా క్ష‌ణ‌మైనా గ‌డ‌వ‌డం క‌ష్టం అంటే న‌మ్మండి. సోఫీ ఇప్ప‌టికే బోలెడ‌న్ని మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీల్ని త‌న‌దైన బోల్డ్ ఎక్స్‌పోజింగ్‌తో చించేసిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments