జాతకాలు చూపించుకుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్? కారణం అదే?

Tuesday, July 25th, 2017, 06:30:12 PM IST


ప్రస్తుతం దేశంలో సాఫ్ట్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగం ఊడుతుందో, ఎప్పుడు కంపెనీ నుంచి బయటకు వెల్లిపోమ్మంటారో తెలియక మానసికంగా తెగ ఆందోళన చేడుతున్నారు. దీంతో ఇంత కాలం వీకెండ్స్ తో పబ్ ల్లో, వీకెండ్ ట్రిప్స్ అంటూ తిరిగే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇప్పుడు జ్యోతీష్యులు, న్యూమరాలజిస్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు. బెంగుళూరు లో షీలా బజాజ్ ఫేమస్ ప్రస్తుతం కొరమంగలలో ఉన్న షీలా న్యూమరాలజిస్ట్‌ కన్సల్టేషన్‌ సంస్థకు టెకీలు బారులు తీరుతున్నారంట. దీనికి గల ప్రధాన కారణం ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులే. చాలామంది సాఫ్ట్‌వేర్‌ నిపుణుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో వారు న్యూమరాలజిస్ట్‌లను ఆ‍శ్రయిస్తున్నారని సమాచారం.

ఆమె దగ్గరకు వెళ్తున్న 95 శాతం తమ క్లయింట్స్‌ ఐటీ రంగం వారు ఉన్నట్లు ఆమె చెబుతున్నారు వారిలో కూడా ఎక్కువగా 35-45 మధ్య వయస్కులేనని పేర్కొన్నారు. అంతకముందు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగం కోసం తమ దగ్గరకు వచ్చేవారని, కానీ ప్రస్తుతం ఉద్యోగ భద్రత గురించి తెలుసుకోవడానికి వస్తున్నట్లు షీలా బజాజ్‌ చెప్పడం విశేషం.
తమను ఆశ్రయిస్తున్న ఐటీ నిపుణులు కూడా ఎక్కువగా అడిగే ప్రశ్నలు.. లేఆఫ్‌ ప్రమాదంలో ఉన్నామని, దాని నుంచి బయటపడాలంటే, ఆధ్యాత్మిక పరిష్కారమేమిటని అడుగుతున్నారని బజాబ్‌ చెప్పారు. లేఆఫ్స్‌ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎంత ఖర్చుకైనా వీరు వెనుకాడటం లేదట. అత్యధిక మొత్తంలో కన్సల్టేషన్‌ ఫీజులను కూడా చెల్లిస్తున్నారని తెలిసింది. ఉద్యోగ కోతతో తమ కంపెనీ ఏప్రిల్‌-జూలై నెలలో 50 మంది తమ కొలీగ్స్‌ను తీసివేశారని, తనను ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలంటూ ఓ కంపెనీకి చెందిన ప్రొగ్రామ్‌ మేనేజర్‌ చంద్రు ఎం కోరినట్టు బజాజ్‌ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న వారు, కుటుంబ సభ్యులు, వారితో సంబంధాలు, ఆరోగ్యం కంటే కూడా ఎక్కువగా ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారని న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. గత కొన్ని నెలలలుగా ఐటీ రంగం నుంచి తమకు క్లయింట్లు పెరుగుతున్నారని తెలిపారు.