నవ్యాంధ్ర రాజధాని విజయవాడ (బెజవాడ)లో మొట్టమొదటి ప్రైవేట్ ఇంక్యుబేషన్ సెంటర్(వై స్క్వేర్ బిజినెస్ ఇంక్యుబేటర్)ని రత్నకుమార్ యార్టగడ్డ ప్రారంభించారు. ఇక నుంచి ఏపీలో ఐటీ స్పీడ్ అందుకున్నట్టే. విదేశాల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఇంక్యుబేషన్ సెంటర్‌తో కనెక్టయ్యి ఉంటాయి. తద్వారా ఏపీ లో భారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఆస్కారం ఏర్పడుతుంది. విజయవాడ సహా ఇతరత్రా పల్లెటూళ్ల నుంచి యువతరానికి బోలెడన్ని ఆఫర్లు మొదలవుతాయి.
ఇదే తరహాలో ఒకప్పుడు అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంకరేజ్‌మెంట్‌తో అప్పటి రాజధాని హైదరాబాద్‌లో ఓ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభమైంది. హైటెక్ సిటీ అభివృద్ధి చెందింది అప్పటినుంచే. సరిగ్గా ఇప్పుడు అదే తరహాలో ఏపీలోనూ ఇంక్యుబేషన్ సెంటర్ల ప్రారంభంతో ఐటీ సహా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. అక్కడ కూడా సైబర్ టవర్లు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఆ పరిసరాల్లో వెల్లువెత్తనున్నాయి. అంతేకాదండోయ్ హైదరాబాద్‌లో ఏ తరహాలో అయితే సాఫ్ట్ వేర్ ట్రైనింగులతో అమీర్ పేట నడిబొడ్డు బిజీ అయ్యిందో.. అలాంటి అమీర్ పేట్ ఒకటి బెజవాడ గళ్లీల్లోనూ వెలసే అవకాశం ఉంది. ఇక నుంచి ఏపీలో యూత్‌కి అక్కడే సాఫ్ట్వేర్ ట్రైనింగ్. దీనివల్ల హైదరాబాద్ వరకూ వచ్చి యువతరం నానా పాట్లు పడాల్సిన పనేలేదు. అద్గదన్నమాట!