రంజైన రామ‌చిల‌క రేతిరికి ర‌మ్మంది!

Saturday, May 26th, 2018, 07:24:52 PM IST

భార్యా భ‌ర్త‌లు సినిమా స్టార్లు అయితే ఆ జంట సంబ‌రాలు మామూలుగా ఉండ‌వు. అందుకు ఇదిగో ఈ జంట ప్ర‌త్య‌క్ష ఎగ్జాంపుల్‌. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ సోద‌రి సోహా అలీఖాన్ దాదాపు 38ఏళ్ల పాటు ఫుల్లుగా లైఫ్‌ని త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేసి, అటుపై త‌న బోయ్‌ఫ్రెండ్ ఖునాల్ ఖీమూని పెళ్లాడేసింది. ఆ జంట‌కు ఓ బిడ్డ కూడా జ‌న్మించాడు. ప్ర‌స్తుతం ఈ జంట అన్యోన్యంగా దాంప‌త్యం సాగిస్తోంది.

వారి మ‌ధ్య అనుబంధం ఎంత బావుందో చెప్పేందుకు ఇదిగో ఈ ఫోటో చూస్తే స‌రిపోతుంది. రియ‌ల్ లైఫ్‌ని, రీల్ లైఫ్‌ని ఇదే తీరుగా ఆహ్లాద‌క‌రంగా గ‌డిపేయ‌డంలో ఈ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. ఇటీవ‌లే ప్ర‌ఖ్యాత మ్యారియ‌ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోటల్ ప్ర‌చార వీడియోలో ఇలా ద‌ర్శ‌న‌మిచ్చారు. వ్య‌క్తిగ‌త జీవితంలో ఆనందోత్సాహం.. మ‌రోవైపు ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆదాయం.. ఈ జంట సొంతం. త‌దుప‌రి క‌రీనా త‌ర‌హాలోనే సోహా కూడా తిరిగి బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments