చంద్రబాబుకి ఏమైంది..? దాచిపెడుతున్న కుటుంబసభ్యులు

Tuesday, August 13th, 2019, 04:24:58 PM IST

70 ఏళ్ల వయస్సు వచ్చిన కానీ, ఇంకా రోజుకి 18 గంటలు విశ్రాంతి అనేది లేకుండా కష్టపడుతుంటాడు చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో రాణించాలంటే మంచి ఆరోగ్యం ఉండాలనేది బాబు ఆలోచన. అందుకే ఫుడ్ విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటాడు. చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కానీ, వయస్సుతో వచ్చే వాటిని తట్టుకోవటమా చాలా కష్టం.

ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదనే మాటలు గట్టిగానే వినవస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే హైదరాబాద్ వచ్చి ఇక్కడ చికిత్స తీసుకోని ఇటు నుండి డైరెక్ట్ అమెరికా వెళ్లి వచ్చాడు. తాజాగా అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబు చేతికి పెద్ద కట్టు కట్టి ఉంది.చేయి భాగం మొత్తం మడవటానికి కూడా వీలు లేకుండా ఆ కట్టు కట్టారు. వేళ్ల దగ్గర నుంచి మోచేతి ముందు భాగం వరకూ బ్యాండ్ వేశారు.

మాములుగా చూస్తే అది కనిపించదు. ఎందుకంటే బాబు వేసుకునే డ్రెస్ కలర్ లోనే ఆ కట్టు అనేది ఉంటుంది. చంద్రబాబు మోచేతి నుంచి ఆ కట్టు వేళ్ల వరకూ ఉంది. దానిని చూస్తే బాబుకి ఎదో పెద్ద దెబ్బ తగిలే ఉంటుందని మాత్రం తెలుస్తుంది, కానీ ఆ విషయం పార్టీలోని నేతలెవరికి కూడా తెలియదు. అలాగని బాబుని అడిగే ధైర్యం కూడా ఎవరు చేయరు. ఏమైనా చిన్న సమస్య వస్తే పార్టీలోని తనకి దగ్గరగా వుండే నేతలతో బాబు చెప్పేవాడు, కానీ ఈ విషయంలో మాత్రం చెప్పటం లేదని తెలుస్తుంది.